అదే నాకు మీరిచ్చే గొప్ప బహుమతి – కమల్ హాసన్

Published on Nov 7, 2021 9:02 pm IST

నేడు కమల్‌ హాసన్‌ పుట్టినరోజు. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులతో పాటు అభిమానుల నుంచి ఆయనకు వరుసగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే, కొందరు అభిమానులు కమల్ బ్యానర్లు కట్టి హడావిడి చేశారు. వాటికి స్పందించిన కమల్ ట్వీట్‌ చేస్తూ.. ‘ఇది ఆపద వేళ.. ఈ సమయంలో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం చెన్నై వర్షాలతో తీవ్ర ఇబ్బంది పడుతోంది. పేదలకు అలాగే సాయం అవసరమైన వారికి సాయం చేయండి.

అభిమానులందరూ అదే నా పుట్టినరోజున మీరిచ్చే గొప్ప బహుమతి’’ అని కమల్ ట్వీట్ చేశాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కమల్‌ హాసన్ హీరోగా.. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రాబోతున్న ‘విక్రమ్‌’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకం పై మహేంద్రన్‌ తో కలిసి కమల్‌ హాసన్ నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :