వరల్డ్ వైడ్ భారీ నెంబర్ స్క్రీన్స్ లో “విక్రమ్” రిలీజ్..!

Published on May 29, 2022 7:03 am IST


లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “విక్రమ్” కోసం పాన్ ఇండియా వీక్షకులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో కమల్ తో పాటుగా మరికొందరు విలక్షణ నటులు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ అలాగే హీరో సూర్య లు కీలక పాత్రల్లో నటించారు. దీనితో అన్ని భాషల్లో కూడా మంచి అంచనాలు ఈ సినిమాపై నెలకొన్నాయి.

ఇక రిలీజ్ కి దగ్గర అవుతున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీ నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ లో రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తోంది. అన్ని భాషల్లో అన్ని ఏరియాల్లో కలిపి 5000 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఆ అంచనాలను రీచ్ అయ్యే స్థాయి వసూళ్లను ఈ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందివ్వగా కమల్ హాసన్ తన రాజ్ కమల్ బ్యానర్ పై నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :