ఇంట్రెస్టింగ్.. ఈ ఫార్మాట్ లో కూడా “ఇండియన్ 2”

ఇంట్రెస్టింగ్.. ఈ ఫార్మాట్ లో కూడా “ఇండియన్ 2”

Published on Jul 9, 2024 12:36 PM IST

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా యంగ్ హీరో సిద్ధార్థ్ మరో ముఖ్య పాత్రలో మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “ఇండియన్ 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ అయితే సినిమా ప్రమోషన్స్ ని పాన్ ఇండియా భాషల్లో చేస్తూ వెళ్తున్నారు.

అయితే ఇంకొన్ని రోజుల్లోనే సినిమా థియేటర్స్ లోకి రానుండగా ఈ సినిమా రిలీజ్ ఫార్మాట్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తున్నారు మేకర్స్. గత కొన్ని రోజులు కితమే ఈ చిత్రం ఐమ్యాక్స్ వెర్షన్ లో కూడా రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేయగా ఇప్పుడు మరో ఫార్మాట్ 4డిఎక్స్ లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. మరి ఈ భారీ చిత్రం ఈ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తుందో లేదో అనేది వేచి చూడాలి. ఇక ఈ భారీ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు