“విక్రమ్” హిట్ పట్ల లోకేష్ ఎమోషనల్..కమల్ సాలిడ్ రిప్లై.!

Published on Jun 5, 2022 6:30 pm IST


లేటెస్ట్ గా రిలీజ్ అయ్యిన చిత్రాల్లో సాలిడ్ హిట్ గా నిలిచిన ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ “విక్రమ్” కూడా ఒకటి. లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ అలాగే సూర్యలు నటించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా పై టోటల్ ఇండియన్ వైడ్ భారీ రెస్పాన్స్ ఇపుడు వస్తుంది. అయితే ఇదిలా ఉండగా ఈ సినిమా హిట్ తో దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ పై ఫస్ట్ డే నుంచే పెద్ద ఎత్తున ప్రశంసలు కురిసాయి.

ఇండియన్ సినిమా దగ్గర ఒక కొత్త ఇంట్రెస్టింగ్ ట్రెండ్ ని స్టార్ట్ చేసాడని అంతా అభినందిస్తుండగా లోకేష్ తాజాగా చాలా ఎమోషనల్ గా స్పందించాడు. ఇంతకు ముందు ఎప్పుడు ఇంత ఎమోషనల్ అయ్యింది లేదని విక్రమ్ సినిమాపై అందరూ చూపిస్తున్న ప్రేమ అభిమానం ఎంతో భావోద్వేగానికి నన్ను లోను చేస్తుంది అని తెలిపాడు.

అలాగే దీనిని మళ్ళీ ఎలా తిరిగి ఇవ్వాలో కూడా అర్ధం కావట్లేదు. ఆడియెన్స్ కి నా హీరో కమల్ హాసన్ గారికి మిగతా నటులకి చాలా ఋణ పడి ఉంటానని లోకేష్ తెలిపాడు. అయితే దీనికి గాను కమల్ హాసన్ రిప్లై ఇస్తూ నువ్వు ప్రేక్షకులకి ఏమన్నా తిరిగి ఇవ్వాలి అనుకుంటే అది మళ్ళీ నీ వర్క్ తోనే ఇవ్వు.

నిజాయితీగా పని చేస్తూ వెళ్ళు వారి నుంచి ఎప్పుడూ నీకు ప్రేమ, గౌరవం ఎప్పుడూ ఉంటుంది, నేను కూడా వారు అందించే ప్రేమాభిమానాల వల్లే అంత ఎనర్జిటిక్ గా సినిమాలు చేస్తాను. ఈ సినిమాకి సపోర్ట్ చేసినట్టు గానే మేము నిన్ను ఎప్పుడు సగర్వంగా సపోర్ట్ చేస్తాం ఇలాగే ఉండు” అంటూ కమల్ సాలిడ్ రిప్లై ఇచ్చారు.

సంబంధిత సమాచారం :