కమల్‌ హాసన్ కు కరోనా పాజిటివ్ !

Published on Nov 22, 2021 5:08 pm IST

సీనియర్ హీరో కమల్‌ హాసన్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని కమల్ హాసనే స్వయంగా చెప్పారు. కమల్ తనకు కరోనా పాజిటివ్ అని పోస్ట్ చేసిన మెసేజ్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. నాకు కరోనా పాజిటివ్ వచ్చిందనే విషయాన్ని అందరికీ తెలియజేయదల్చుకున్నాను. నియమ నిబంధనలు పాటిస్తూ నాకు నేనుగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లాను అని కమల్ చెప్పుకొచ్చారు.

కాగా కమల్ హాసన్ యూఎస్ నుంచి తిరిగి వచ్చినప్పుడు కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేశారు. ఆ సమయంలో పాజిటివ్ గా తేలింది. కమల్ తాను ప్రస్తుతం ఆసుపత్రి నిర్బంధంలో ఉన్నానని, ప్రజలు సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఇక కమల్ తో సన్నిహితంగా ఉన్న మిగిలిన వాళ్లు కూడా క్వారంటైన్ లోకి వెళ్లారు. ఏది ఏమైనా వరుసగా మళ్ళీ కేసులు వస్తుండడంతో.. మిగిలిన మేకర్స్ లో కూడా ఆందోళన మొదలైంది.

కరోనా వైరస్ ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో అటు ప్రజలు కూడా ఆందోళన గా ఉన్నారు. మూడో సీజన్ కూడా వస్తే.. షూటింగ్స్ కి బ్రేక్ ఇవ్వాల్సి వస్తోంది.

సంబంధిత సమాచారం :