అబుదాబిలో ఐఐఎఫ్ఏ అత్యున్నత పురస్కారాన్ని అందుకోనున్న కమల్ హాసన్

Published on May 26, 2023 1:35 am IST

గ్రాండ్ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఐఎఫ్ఏ అవార్డ్స్)కు రంగం సిద్ధమైంది. ఈ మెగా మూవీ కార్నివాల్ 23వ ఎడిషన్ మే 26, 27 తేదీల్లో అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లోని ఎతిహాద్ ఎరీనాలో గ్రాండ్ లెవెల్లో జరగనుంది. హిందీ సినిమా స్టార్లు అభిషేక్ బచ్చన్ మరియు విక్కీ కౌశల్ ఈ సంవత్సరం ఈవెంట్‌ను హోస్ట్ లుగా వ్యవహరించనున్నారు.

అబుదాబిలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన కర్టెన్ రైజర్ ప్రెస్ మీట్‌లో, ఐఐఎఫ్ఏ మేనేజ్‌మెంట్‌తో పాటు అడ్వైజరీ బోర్డ్ సభ్యులు, దిగ్గజ నటుడు, దర్శకుడు అయిన కమల్ హాసన్‌కు భారతీయ సినిమాలో ఐఐఎఫ్ఏ అత్యుత్తమ విజయ పురస్కారాన్ని అందజేయాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. 2023 వ సంవత్సరం తమిళం మరియు భారతీయ సినిమాల స్థాయిని మరింతగా పెంచడంలో కమల్ హాసన్ చేసిన కృషికి ఈ అవార్డును అందజేస్తున్నారు. ఇక ప్రస్తుతం కమల్ హాసన్, శంకర్ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్న భారతీయుడు 2లో నటిస్తున్నారు. ఈ మూవీ పై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

సంబంధిత సమాచారం :