క‌మ‌ల్ హాస‌న్‌ ‘విక్ర‌మ్‌’ సినిమాలో మరో స్టార్ హీరో?

క‌మ‌ల్ హాస‌న్‌ ‘విక్ర‌మ్‌’ సినిమాలో మరో స్టార్ హీరో?

Published on Mar 26, 2022 3:02 AM IST

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “విక్రమ్”. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విలక్షణ నటులు విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన వార్త ఒకటి ఇప్పుడు ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది.

అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీ రోల్‌లో న‌టించ‌బోతున్నాడ‌న్న వార్తలు వినిపిస్తున్నాయి. సెకండాఫ్‌లో వ‌చ్చే కీల‌క స‌న్నివేశంలో బిగ్ బీ కనిపిస్తాడని అంటున్నారు. ఇకపోతే 2022 జూన్ 13వ తేది తెలుగు, త‌మిళంతోపాటు ప‌లు భారతీయ భాష‌ల్లో విడుద‌ల కాబోతున్న ఈ చిత్రానికి అనిరుధ్ ర‌విచంద‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా పనిచేస్తున్నాడు. ‘ ‘

సంబంధిత సమాచారం

తాజా వార్తలు