పార్టీ పేరును ప్రకటించనున్న కమల్ హాసన్ !


రజనీకాంత్ ఎంట్రీతో వేడెక్కిన తమిళ రాజకీయాల్లో త్వరలో మరొక సంచలనం చోటు చేసుకోనుంది. స్టార్ హీరో, గత కొన్ని నెలలుగా తమిళ రాజకీయాల పట్ల చురుగ్గా స్పందిస్తూ, తన అభిప్రాయాల్ని వెలిబుచ్చుతున్న విజయనటుడు కమల్ హాసన్ త్వరలో అధికారికంగా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటం కూడా చేశారాయన.

అందులో ‘తమిల్ ప్రజలు నాకెంతో ఇచ్చారు. వాళ్లకు తిరిగి చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజల అవసరాలు తెలుసుకోవడానికి టూర్ ను ప్రారంభిస్తాను. ఫిబ్రవరి 21న నా స్వస్థలం రామంతపురం నుండి ఈ యాత్ర మొదలవుతుంది. పార్టీ పేరును, విధి విధానాలను కూడా అప్పుడే ప్రకటిస్తాను. ఆ తర్వాత మధురై, దుండిగల్, శివగంగై ప్రాంతాల ప్రజల్ని కూడా కలుస్తాను’ అన్నారు.

దశల వారీగా ఈ టూర్ జరుగుతుందని చెప్పిన కమల్ ఇదేదో గ్లామర్ కోసం చేస్తున్నది కాదని నా ప్రజల్ని నేను అర్థం చేసుకోవడానికి ఇదొక అవకాశమని అన్నారు.