క్రేజీ బజ్ : ప్రభాస్ ‘ప్రాజక్ట్ – కె’ లో కమల్ కీలక రోల్ ?

Published on May 31, 2023 3:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మరియు బాలీవుడ్ అందాల నటి దీపికా పదుకొనే హీరోయిన్ గా తాజాగా గ్రాండ్ లెవెల్లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రాజెక్ట్ కె. 2024లో మోస్ట్ అవైటెడ్ సినిమాలలో ఇది కూడా ఒకటి. దాదాపుగా రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా భారీ పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న ప్రాజక్ట్ కె ని విడుదల చేయనున్నట్లు ఇటీవల మేకర్ ప్రకటించారు.

ఇక తాజగా ఈ సినిమాకి సంబంధించి ఒక సంచలన బజ్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. దాని ప్రకారం, కోలీవుడ్ లెజెండరీ నటుడు కమల్ హాసన్ ని ఒక కీలక రోల్ కోసం ప్రాజెక్ట్ కె మేకర్స్‌ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే వారి మధ్య చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, రానున్న రోజుల్లో దీనిపై ప్రాజక్ట్ కె మేకర్స్ నుండి స్పష్టత రానుందని తెలుస్తోంది. కాగా ఈ మూవీ మేకర్స్ 20 రోజుల కమల్ కాల్షీట్ల కోసం భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారని కూడా బజ్ ఉంది.

ఒకవేళ కమల్ హాసన్ ఈ ఆఫర్‌ను అంగీకరించాలని నిర్ణయించుకుంటే ప్రాజెక్ట్ కె మూవీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ట్రేడ్ సర్కిల్స్ లో పెద్ద హాట్ కేక్ అవుతుందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగానిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు.

సంబంధిత సమాచారం :