‘కేరళ స్టోరీ’ మూవీ పై కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on May 28, 2023 12:31 am IST

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద వివాదాస్పద సినిమా కేరళ స్టోరీ మంచి కలెక్షన్ తో దూసుకెళుతోంది. అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బాలామి, మరియు సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకి సుదీప్తో సేన్ దర్శకత్వం వహించారు.ఇటీవల రూ.200 కోట్ల మార్క్ కలెక్షన్ అందుకుని దూసుకెళ్తున్న ఈ మూవీ పై తాజాగా లోక నాయకుడు కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. ప్రస్తుతం ఐఐఎఫ్ఏ అవార్డులకు హాజరు కావడానికి యుఎఈ లో ఉన్నారు కమల్.

భారతీయ సినిమాకి చేసిన అపారమైన చేసిన సేవకి గాను ఇండియన్ సినిమా అవార్డ్‌తో ఆయనని సత్కరించనున్నారు. తన పర్యటనలో భాగంగా దుబాయ్‌లోని ఎక్స్‌పో సిటీలోని ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాను సందర్శించి అక్కడి మీడియాతో మాట్లాడారు కమల్. కాగా మీడియా అధికారి ఒకరు కేరళ స్టోరీపై తన అభిప్రాయాలను అడిగినప్పుడు, ఇది ఒక ప్రచార చిత్రం మాత్రమే అని మరియు దానికి తాను వ్యతిరేకమని పేర్కొన్నారు. దిగువ లోగోలో నిజమైన కథ అని వ్రాసినంత మాత్రాన కథ నిజం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా కమల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇంటర్నెట్‌లో కొద్దిసేపటికే వైరల్‌గా మారాయి.

సంబంధిత సమాచారం :