లేటెస్ట్ : కమల్ హాసన్ ‘విక్రమ్’ 100 డేస్ సెలబ్రేషన్స్ వెన్యూ, డేట్ ఫిక్స్

లేటెస్ట్ : కమల్ హాసన్ ‘విక్రమ్’ 100 డేస్ సెలబ్రేషన్స్ వెన్యూ, డేట్ ఫిక్స్

Published on Oct 28, 2022 3:01 AM IST

లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ విక్రమ్ హిట్ లిస్ట్. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాసిల్ కీలక పాత్రలు చేసిన ఈ మూవీని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థపై కమల్ హాసన్ స్వయంగా నిర్మించారు. అయితే రిలీజ్ తరువాత తమిళ్ సహా అన్ని భాషల్లో పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టింది విక్రమ్. ఇక ఈ మూవీలో కమల్ హాసన్ అద్భుత నటనతో పాటు డైరెక్టర్ లోకేష్ అత్యద్భుత దర్శకత్వ ప్రతిభ పై అందరి నుండి మంచి ప్రశంసలు కురిసాయి. ఈ మూవీలో రోలెక్స్ అనే ప్రత్యేక పాత్రలో కొన్ని క్షణాలపాటు సూర్య కనిపించి ఆకట్టుకున్నారు.

అయితే విషయం ఏమిటంటే, ఇటీవల పలు సెంటర్స్ లో సక్సెస్ఫుల్ గా 100 డేస్ కంప్లీట్ చేసుకున్న విక్రమ్ మూవీ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్స్ ని నవంబర్ 7 న కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా చెన్నైలో గల కలైవనార్ అరంగం స్టేడియంలో ఎందరో ప్రేక్షకాభిమానుల సమక్షంలో సాయంత్రం 5 గంటల నుండి ఎంతో వైభవంగా నిర్వహించనున్నట్లు రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ వారు కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ఒక ప్రకటన ద్వారా తెలిపారు. కాగా ఈ వేడుకకు వేలాదిగా కమల్ ఫ్యాన్స్, ఆడియన్స్ తరలిరానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు