రేర్ ఫీట్ అందుకున్న కమల్ హాసన్ ‘ విక్రమ్ ‘

Published on Oct 4, 2022 3:00 am IST

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ విక్రమ్. విజయ్ సేతుపతి, ఫాహాద్ ఫాసిల్ కీలకపాత్రలు చేసిన ఈ సినిమా ఇటీవల అన్ని భాషల్లో భారీ సక్సెస్ అందుకుంది. ఇక ప్రస్తుతం ఈ మూవీ ఒక రేర్ ఫీట్ ని సొంతం చేసుకుంది. ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా జరిగే బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో విక్రమ్ స్పెషల్ గా స్క్రీనింగ్ కానుంది.

దాదాపుగా 26 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ ఫెస్టివల్ లో ఈ ఏడాది ఓపెన్ ఫిలిం క్యాటగిరీలో విక్రమ్ ప్రదర్శన కానుంది. ఆసియా సినిమాల యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రతి సంవత్సరం దీనిని నిర్వహిస్తుంటారు.ఇక ఏడాది ఈ ఫిలిం ఫెస్టివల్ అక్టోబర్ 4 నుంచి 15 వరకు గ్రాండ్ గా జరగనుంది. కాగా విక్రమ్ మూవీ ఈ ఫెస్టివల్ లో సెలెక్ట్ అయినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ కొద్దిసేపటి క్రితం రాజ్ కమల్ ఇంటర్నేషనల్ వారు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం అది పలు మీడియా మాధ్యమాలలో వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :