కమల్ ‘విక్రమ్’ మూవీ ఓటిటీలో రిలీజ్ అప్పుడేనా ?

కమల్ ‘విక్రమ్’ మూవీ ఓటిటీలో రిలీజ్ అప్పుడేనా ?

Published on Jun 24, 2022 12:30 AM IST

ఉలగ నాయగన్ కమల్ హాసన్ హీరోగా విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ విక్రమ్. మల్టివర్స్ మూవీగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన విక్రమ్ మూవీ, అన్ని భాషల్లో కూడా సూపర్ హిట్ కొట్టి ప్రస్తుతం మంచి కలెక్షన్స్ తో దూసుకెళుతోంది. యాక్షన్ తో కూడిన థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ గా యువ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన విక్రమ్ మూవీని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై కమల్ హాసన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా యువ మ్యూజికల్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు.

గిరీష్ గంగాధరన్ ఫోటోగ్రఫి అందించిన విక్రమ్ మూవీ నేటితో సక్సెస్ఫుల్ గా 25 రోజులు పూర్తి చేసుకుంది. ఇక అసలు విషయం ఏమిటంటే ఈ మూవీ జులై నెల మొదటి వారంలో ఓటిటి ప్రేక్షకులకు అందుబాటులో రానున్నట్లు సమాచారం. ప్రముఖ ఓటిటి సంస్థ డిస్నీ హాట్ స్టార్ వారు ఎంతో భారీ ధరకు ఈ మూవీ ఓటిటి హక్కులు సొంతం చేసుకున్నారని, అలానే ఓటిటి రిలీజ్ కి సంబంధించి త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ రానుందని తెలుస్తోంది. మరి ఇదే కనుక నిజం అయితే, విక్రమ్ ఓటిటి కోసం ఎదురు చూస్తున్న ఆడియన్స్ కి ఇది మంచి పండుగ వార్తే అంటున్నారు సినీ విశ్లేషకులు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు