లేటెస్ట్ : కమల్ హాసన్ హెల్త్ అప్ డేట్

Published on Nov 24, 2022 6:09 pm IST

ఉలగనాయగన్ కమల్ హాసన్ ఇటీవల లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ సక్సెస్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం దిగ్గజ దర్శకడు శంకర్ తో ఆయన చేస్తున్న ఇండియన్ 2 మూవీ షూటింగ్ జరుపుకుంటోంది. ఎంతో భారీ వ్యయంతో రూపొందుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే విషయం ఏమిటంటే, నేడు ఉదయం తనకు కొద్దిపాటి అస్వస్థతో కమల్ చెన్నైలోని ఒక ఆసుపత్రిలో చేరారు.

అయితే ఆయన ఆరోగ్యం పై పలువురు అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆసుపత్రి డాక్టర్లు కొద్దిసేపటి క్రితం ఆయన హెల్త్ అప్ డేట్ ని రిలీజ్ చేసారు. చెన్నై లోని శ్రీ రామచంద్ర మెడికల్ సెంటర్ వారు రిలీజ్ చేసిన అప్ డేట్ లో కమల్ కొద్దిపాటి జ్వరం, జలుబు, దగ్గు వలన చికిత్స కోసం చేరారని, ప్రస్తుతం మెల్లగా కోలుకుంటున్న ఆయన రేపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇక కమల్ కోలుకుంటుండడంతో ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :