కార్తితో కమల్ హాసన్ భారీ సినిమా.. డైరెక్టర్ అతనే ?

కార్తితో కమల్ హాసన్ భారీ సినిమా.. డైరెక్టర్ అతనే ?

Published on Oct 25, 2022 7:06 AM IST

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ ల కాంబోలో వచ్చిన భారీ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా “విక్రమ్”. ఈ సినిమా విజయం కమల్ కి బాగా కలిసొచ్చింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా భారీ వసూళ్లతో అదరగొట్టింది. నిర్మాతగా కమల్ కి భారీ లాభాలను తెచ్చి పెట్టింది. అందుకే.. కమల్ నిర్మాతగా భారీ సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు. తాజాగా కమల్ హాసన్ నిర్మాతగా రాజ్ కమల్ బ్యానర్ పై హీరో కార్తి నటించబోతున్నాడు.

ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. అయితే లోకేష్ కనగరాజ్ ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ తర్వాత స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. మరోవైపు కమల్ హీరోగా కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే నిర్మాత గానూ బిజీగా మారుతున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు