పుష్ప సినిమాను వీక్షించిన కమల్‌హాసన్.. ఏమన్నాడంటే?

Published on Jan 16, 2022 1:01 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం “పుష్ప ది రైజ్”. గత ఏడాది డిసెంబర్ 17వ తేదిన విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుని భారీ వసూళ్లను రాబట్టుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లోనూ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమాను తాజాగా కమల్ హాసన్ వీక్షించారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ప్రత్యేకంగా కమల్ హాసన్ కి పుష్ప సినిమాను చూపించారు.

ఈ విషయాన్ని దేవి శ్రీ ప్రసాద్ ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. డియరెస్ట్ ఉలగనయగన్ కమల్ హాసన్ సర్ ధన్యవాదాలు.. మాకోసం మీ సమయాన్ని వెచ్చించి పుష్ప సినిమా చూసినందుకు.. మీరు చాలా స్వీటెస్ట్.. సినిమా చూసి మా పనితనం గురించి మీరు చెప్పిన మాటలు అద్భుతం అని చెప్పుకొచ్చారు. ఇక ఈ ట్వీట్ కి అల్లు అర్జున్ కూడా స్పందిస్తూ పుష్ప సినిమా వీక్షించినందుకు ధన్యవాదాలు కమల్ హాసన్ సార్.. అని తెలిపారు.

సంబంధిత సమాచారం :