థలపతి విజయ్ తో సినిమా పై క్లారిటీ ఇచ్చిన కమల్ హాసన్!

Published on May 30, 2022 12:04 am IST


కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగ రాజు దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం విక్రమ్. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. జూన్ 3, 2022 న ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల కాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు విడుదలై ప్రేక్షకులని, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం కి సంబంధించిన ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ వేగవంతం చేయడం జరిగింది.

అయితే తాజాగా మీడియా తో జరిగిన ఇంటరాక్షన్ లో కమల్ హాసన్ ను విజయ్ తో సినిమా పై క్లారిటీ ఇచ్చారు. విజయ్ తో సినిమా ఎప్పుడు చేస్తారు అని అడగగా, అందుకు విజయ్ డేట్స్ దొరికినప్పుడు అంటూ చెప్పుకొచ్చారు. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తలపతి విజయ్ సైతం ప్రస్తుతం తన నెక్స్ట్ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వం లో చేస్తున్నారు. ఈ సినిమా పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :