సూర్య కి కమల్ ఖరీదైన గిఫ్ట్…మామూలుగా లేదుగా!

Published on Jun 8, 2022 8:00 pm IST

కమల్ హాసన్ హీరోగా లోకేష్ దర్శకత్వం లో తెరకెక్కిన విక్రమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం లో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫజిల్ కీలక పాత్రల్లో నటించారు. హీరో సూర్య ఈ చిత్రం లో స్పెషల్ రోల్ చేసి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నారు. ముఖ్యం గా రోలెక్స్ పాత్ర కి సూర్య పెర్ఫెక్ట్ అంటూ ఫ్యాన్స్ చెబుతున్నారు. సూర్య పాత్ర కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

అయితే ఈ చిత్రం కి నిర్మాత గా వ్యవహరించిన కమల్ హాసన్ ఇప్పటికే డైరెక్టర్ లోకేష్ కి ఖరీదైన కారును బహుమతి గా ఇవ్వగా, తాజాగా రోలేకో పాత్ర పోషించిన సూర్య కి రోలెక్స్ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనిరుద్ రవి చందర్ సంగీతం అందించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రన్ అవుతుంది. ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :