తమిళ రాజకీయాల్ని వేడెక్కించిన కమల్ హాసన్ !

19th, July 2017 - 02:37:09 PM


స్టార్ హీరో కమల్ హాసన్ గత కొన్నాళ్లుగా తమిళనాడు, దేశానికి సంబందించిన సామాజిక, రాజకీయ పరిస్థితుల పట్ల ఎప్పటికప్పుడు తనదైన శైలిలో ధీటుగా స్పందిస్తూ అందరి దృష్టినీ తనవైపుకు తిప్పుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ట్విట్టర్లో ఆయన చేసిన కామెంట్స్ కొన్ని ఆయన రాజకీయ రంగ ప్రవేశంపై కొత్త ఊహాగానాలు పుట్టేలా చేశాయి.

ట్విట్టర్లో ‘విమర్శించనీయండి. ఇప్పుడెవరూ రాజు కాదు. అనుకుంటే ముఖ్యమంత్రిని నేనే’ అంటూ తనను విమర్శిస్తున్నవారి పట్ల వ్యతిరేకతను దీటుగా ప్రకటించారు. కమల్ ఇచ్చిన ఈ అనూహ్య స్టేట్మెంట్ తో తమిళనాట రాజకీయ వర్గాల్లో కలకలం మొదలైంది. కొందరు ఇప్పటికే కమల్ తమ పార్టీలో చేరతాడంటూ ప్రచారం కూడా మొదలుపెట్టారు.