“విక్రమ్‌” సినిమాకి కమల్ హాసన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా?

Published on Jun 2, 2022 12:00 am IST

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ “విక్రమ్”. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలింస్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో విలక్షణ నటులు విజయ్ సేతుపతి మరియు ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తుండగా, హీరో సూర్య అతిథి పాత్రలో కనిపించనున్నాడు. జూన్‌ 3న తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలోనూ విడుదల కానుంది. ఈ క్రమంలో ఇందులో నటీనటులకు ఎంతమేర పారితోషికం ఇచ్చారన్న విషయం ఇప్పుడు హాట్ టాఫిక్‌గా మారింది.

ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ఈ సినిమా బడ్జెట్‌ రూ.120 కోట్ల పైనే ఉండగా చిత్రబృందం రెమ్యునరేషన్‌ కూడా భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కమల్‌ హాసన్‌ రూ.50 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకోగా, డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌ దాదాపు రూ.8 కోట్లు అందుకున్నట్లు సమాచారం. ఇక విజయ్‌ సేతుపతికి రూ.10 కోట్లు, ఫహద్‌ ఫాజిల్‌కు రూ.4 కోట్ల పారితోషికం అందినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించిన అనిరుధ్‌ రవిచందర్‌కు కూడా రూ.4 కోట్లు ముట్టజెప్పారట.

సంబంధిత సమాచారం :