“విక్రమ్” ను హిట్ చేసినందుకు ఆడియెన్స్ కి థాంక్స్ తెలిపిన కమల్!

Published on Jun 7, 2022 2:40 pm IST


కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజు దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ విక్రమ్. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీగా థియేటర్ల లో విడుదల అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఊహించిన దానికంటే భారీ రెస్పాన్స్ తో దూసుకు పోతూ, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం లో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫజిల్ లు కీలక పాత్రల్లో నటించగా, సూర్య స్పెషల్ రోల్ లో విశేషం గా ఆకట్టుకున్నారు. ఈ చిత్రం ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు కమల్ హాసన్ థాంక్స్ తెలిపారు.

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకం పై తెరకెక్కిన ఈ చిత్రం కి అనిరుద్ రవి చందర్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఓవర్సీస్ లో, తెలుగు రాష్ట్రాల్లో సైతం భారీగా వసూళ్లను రాబడుతోంది. లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :