కమల్ “విక్రమ్” సక్సెస్…అప్పుడు రాజ్ కపూర్, ఇప్పుడు సల్మాన్ ఖాన్!

Published on Jun 12, 2022 11:50 pm IST


యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ విక్రమ్. ఈ చిత్రం తో కమల్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. తమిళనాట ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ చిత్రం అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం మాత్రమే కాకుండా, భారీ వసూళ్లను రాబడుతోంది. అయితే విక్రమ్ సినిమా పై సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యం లో మెగాస్టార్ చిరంజీవి మరియు సల్మాన్ ఖాన్ లు కమల్ హాసన్ విక్రమ్ సక్సెస్ కి గానూ అభినందించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గతం లో 36 ఏళ్ల క్రితం కమల్ హాసన్ స్వాతి ముత్యం సినిమా సక్సెస్ కి అవార్డ్స్ అందుకోవడం తో పాటుగా, రాజ్ కపూర్ తో ప్రశంసలు అందుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ రెండు ఫోటోలలో మెగాస్టార్ చిరంజీవి ఉండటం విశేషం.

సంబంధిత సమాచారం :