అక్కడ బీస్ట్, కేజీఎఫ్2 లను బీట్ చేసిన కమల్ “విక్రమ్”

Published on Jun 12, 2022 4:47 pm IST


యూనివర్సల్ యాక్టర్ కమల్ హాసన్ తాజాగా విడుదల అయిన విక్రమ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమా తమిళ నాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

తమిళనాడులో 9 రోజుల్లో 121 కోట్లు. దీంతో రాష్ట్రంలో కేవలం 9 రోజుల్లోనే బీస్ట్, కేజీఎఫ్ 2 టోటల్ కలెక్షన్స్ రెండింటినీ ఈ సినిమా క్రాస్ చేసినట్లు కన్ఫర్మ్ అయింది. సినిమా అందరినీ ఆకట్టుకోవడంతో ప్రస్తుతం మంచి వసూళ్లు రాబడుతూ, రానున్న రోజుల్లో మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ఆర్‌కెఎఫ్‌ఐ బ్యానర్‌పై కమల్ హాసన్ మరియు ఆర్ మహేంద్రన్ నిర్మించిన ఈ బిగ్గీలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ మరియు సూర్య ముఖ్యమైన పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :