కమల్ “విక్రమ్” ఫస్ట్ వీక్ వసూళ్లు…మామూలుగా లేదుగా!

Published on Jun 10, 2022 5:00 pm IST

కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజు దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ విక్రమ్ థియేటర్ల లో సక్సస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ చిత్రం ఫస్ట్ వీక్ పూర్తి చేసుకొని, రెండో వారం లోకి సక్సస్ ఫుల్ గా అడుగు పెట్టడం జరిగింది. ఈ చిత్రం విడుదల అయిన అన్ని చోట్ల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. మొదటి వారం ప్రపంచ వ్యాప్తంగా 250 కోట్ల రూపాయల కి పైగా వసూళ్లను రాబట్టి తమిళ నాట సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

ఈ చిత్రం చాలా ప్రాంతాల్లో భారీ వసూళ్లను రాబడుతూ, రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఫాహద్ ఫజిల్, విజయ్ సేతుపతి, సూర్య లాంటి సూపర్ క్రేజ్ ఉన్నటువంటి నటులు ఈ చిత్రం లో నటించడం తో సినిమా కి మరింత ఎనర్జీ వచ్చినట్లు అయ్యింది. ఈ భారీ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :