కమల్ హాసన్ “విక్రమ్” రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Mar 14, 2022 10:20 am IST

కమల్ హాసన్ మరియు విజయవంతమైన దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం విక్రమ్. స్టార్ నటులు ఫాహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈరోజు మేకర్స్ సోషల్ మీడియా ద్వారా సినిమా విడుదల తేదీని ప్రకటించారు. మేకింగ్ వీడియోను విడుదల చేస్తూ, రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేయడం జరిగింది. విక్రమ్ జూన్ 3, 2022న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

కమల్ హాసన్ తన హోమ్ బ్యానర్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ మరియు మహేంద్రన్‌ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విక్రమ్ థియేటర్లలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :