నేడు రిలీజ్ కానున్న కమల్ హాసన్ “విక్రమ్” తెలుగు ట్రైలర్!

Published on May 20, 2022 10:00 am IST

విశ్వవ్యాప్త నటుడు కమల్ హాసన్ తన రాబోయే యాక్షన్ థ్రిల్లర్ విక్రమ్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ కోలీవుడ్ బిగ్గీలో స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాసిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే విక్రమ్ మేకర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా తెలుగు ట్రైలర్ ఈరోజు సాయంత్రం విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

అలాగే, నటుడు నితిన్ ఈ చిత్రాన్ని తెలుగులో తన హోమ్ బ్యానర్ శ్రేష్ట్ మూవీస్‌పై విడుదల చేయనున్నారు. సూర్య కీలక పాత్రలో నటిస్తున్న ఈ బహుభాషా చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ భారీ స్థాయిలో నిర్మించాయి. జూన్ 3, 2022న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం :