ఇంటెన్స్ యాక్షన్ డ్రామా గా కమల్ “విక్రమ్” ట్రైలర్… అద్దిరిపోయిందిగా!

Published on May 15, 2022 9:09 pm IST

ఇటీవల కాలంలో కోలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం కమల్‌హాసన్‌ నటించిన విక్రమ్‌. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ బిగ్గీలో స్టార్ నటులు విజయ్ సేతుపతి మరియు ఫాహద్ ఫాసిల్ కూడా ఉన్నారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలో గ్రాండ్ గా నిర్వహించారు నిర్మాతలు. ఈలోగా సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకునేలా ఉంది ట్రైలర్. ప్రారంభం నుండి ముగింపు వరకు, ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. కమల్, విజయ్, ఫాహద్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా కట్ చేసిన ట్రైలర్‌కి యాడ్ ఆన్ గా ఉంది. మొత్తానికి ఈ ట్రైలర్ విడుదల అయిన కొద్ది సేపటికే సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌ను కమల్ హాసన్ మరియు ఆర్ మహేంద్రన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ మరియు రెడ్ జెయింట్ మూవీస్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో బ్యాంక్రోల్ చేశారు. అనిరుధ్ ఈ బహుభాషా చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం ను జూన్ 3, 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :