యూఎస్ బాక్సాఫీస్ వద్ద కమల్ “విక్రమ్” దూకుడు!

Published on Jun 13, 2022 7:32 am IST


కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వం లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ విక్రమ్. ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ ఆల్ టైమ్ రికార్డు లను క్రియేట్ చేస్తోంది.

ఈ చిత్రం యూఎస్ లో సైతం మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకూ ఈ చిత్రం 2.5 మిలియన్ డాలర్ల ను వసూళ్ళ ను దాటింది. ఈ చిత్రం లాంగ్ రన్ లో ఇంకా భారీగా రాబట్టే అవకాశం ఉంది. విజయ్ సేతుపతి, ఫాహద్ ఫజిల్, సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం కమల్ హాసన్ హోమ్ బ్యానర్‌పై నిర్మించబడింది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :