రజినీ తో మల్టీస్టారర్ పై కమల్ హాసన్ అభిప్రాయం ఇలా..!
Published on Jan 24, 2017 12:44 pm IST

Kamal-Hassan
కమల్ హాసన్ ప్రస్తుతం ఎక్కువగా జల్లికట్టు అంశం పై స్పందింస్తున్నారు.తన సినీ కెరీర్ గురించి కూడా కమల్ హాసన్ మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా రజినీకాంత్ తో కలసి నటించాలనే తన కోరికని బయటపెట్టారు.తనకు రజినీకాంత్ తో కలసి నటించాలనే కోరిక ఉన్న మాఇద్దరిని కలిపి చిత్రం తీయగలిగే నిర్మాతలు దొరకడం లేదని కమల్ అన్నారు.

గతంలో కమల్ హాసన్ , రజినికాంత్ లు కలసి నటించారు. కానీ ఈ మధ్యకాలంలో ఈ ఇద్దరి స్టార్ ల కలయికలో చిత్రం రాలేదు. వీరిద్దరి కలయికలో చిత్రం ఎప్పుడు వస్తుందనే చర్చ జరుగుతూనే ఉంది. నిర్మాతలు ఎవరైనా మంచి కథ తో వస్తే రజినీకాంత్ తో కిలసి నటించడానికి తాను సిద్ధమని కమల్ అన్నారు.ప్రస్తుతం కమల్ హాసన్ పలు చిత్రాలతో బిజీగా ఉండగా, రజినీకాంత్ 2.0 చిత్రంలో నటిస్తున్నారు.

 
Like us on Facebook