తన రోలెక్స్ కి “విక్రమ్” నుంచి బెస్ట్ విషెష్..!

Published on Jun 30, 2022 9:00 am IST

లేటెస్ట్ గా మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర భారీ వసూళ్లతో అరదరగొట్టిన లేటెస్ట్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం “విక్రమ్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ అలాగే లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ లు సాలిడ్ రోల్స్ లో కనిపించారు. ఇక వీరి కన్నా అయితే స్టార్ హీరో సూర్య చేసిన రోలెక్స్ అయితే ఆడియెన్స్ మైండ్ బ్లాక్ చేసింది.

దీనితో ఇండియన్ సినిమా దగ్గర ఒక ఐకానిక్ రోల్ గా నిలిచిపోయిన ఈ రోల్ తో మళ్ళీ సూర్య మంచి బౌన్స్ బ్యాక్ అవ్వడం ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ కాగా దానికి మించి రీసెంట్ గా ప్రపంచ దిగ్గజ అవార్డు వేడుకలు ఆస్కార్ అకాడమీ నుంచి తనకి కూడా ఒక మెంబర్ గా ఆహ్వానం రావడం ఆసక్తిగా మారింది.

మరి ఈ ప్రౌడ్ మూమెంట్ పై అనేకమంది సినిమా ప్రముఖులు కూడా కంగ్రాట్స్ తెలుపుతుండగా మరి తన సినిమా హీరో విక్రమ్ కమల్ హాసన్ కూడా తన బెస్ట్ విషెష్ ని తెలియజేయడం ఆసక్తిగా మారింది. నా బ్రదర్ సూర్య కి ఈ పిలుపు వచ్చినందనుకు చాలా గర్వంగా ఉందని సూర్య ని జస్ట్ ఆ మూమెంట్ ని ప్రౌడ్ గా ఎంజాయ్ చెయ్యమని సూచిస్తూ కమల్ ట్వీట్ చేశారు. దీనితో ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :