యూఎస్ లో అరుదైన ఫీట్ అందుకున్న “విక్రమ్” వసూళ్లు.!

Published on Jun 8, 2022 9:00 am IST


లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అలాగే ఫహద్ ఫాజిల్ మరియు స్టార్ హీరో సూర్య లు అదిరిపోయే రోల్స్ లో దర్శకుడు లోకేష్ కనగ్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “విక్రమ్ హిట్ లిస్ట్”. విడుదల అయ్యిన అన్ని చోట్ల కూడా భారీ రెస్పాన్స్ తో ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రం కమల్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ మరియు స్టడీ వసూళ్లను అందుకుంటూ హైయెస్ట్ గ్రాసర్ గా దూసుకెళ్తుంది.

ఇక ఇదిలా ఉండగా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర అయితే ఈ చిత్రం అరుదైన ఫీట్ ని అందుకున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రం అక్కడ లేటెస్ట్ గా 2 మిలియన్ డాలర్స్ గ్రాస్ క్లబ్ లో చేరిందట. అయితే ఒక తమిళ సినిమాగా ఇది మాత్రం చాలా అరుదైన ఫీట్ అని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. యూఎస్ లో తమిళ్ సినిమా 2 మిలియన్ క్లబ్ లో జాయిన్ అవ్వడం అనేది నిజం గానే అరుదు. మొత్తానికి విక్రమ్ ఈ ఫీట్ ని అందుకొని స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది మరి ఫైనల్ గా ఏ మార్క్ దగ్గర ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :