ఓటీటీ లో వచ్చేసిన బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ “విక్రమ్”.!

ఓటీటీ లో వచ్చేసిన బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ “విక్రమ్”.!

Published on Jul 8, 2022 7:04 AM IST


లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ లు కీలక పాత్రల్లో స్టార్ హీరో సూర్య సాలిడ్ కామియో లో నటించిన లేటెస్ట్ భారీ హిట్ చిత్రం “విక్రమ్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాదిలో భారీ వసూళ్లతో అన్ని చోట్లా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరి ఇన్ని రోజులు థియేటర్ లలో అలరించిన ఈ చిత్రం ఫైనల్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

ఈ సినిమా అన్ని భాషల స్ట్రీమింగ్ హక్కులు కైవసం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ + హాట్ స్టార్ లో ఈ చిత్రం ఈరోజు ఉదయం 12 గంటల నుంచి ప్రసారం లోకి వచ్చేసింది. మరి ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ ని మళ్లీ ఓసారి ఎంజాయ్ చెయ్యాలి అనుకుంటే ఓటీటీ లో ఇంకో రౌండ్ వెయ్యొచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందివ్వగా కమల్ మరియు ఆర్ మహేంద్రన్ లు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు