ఇండియాలో రికార్డ్ మార్క్ టచ్ చేసిన “విక్రమ్” వసూళ్లు.!

Published on Jul 6, 2022 12:40 pm IST


లోకనాయకుడు హీరోగా ఫహద్ ఫాజిల్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లు పాత్రల్లో స్టార్ హీరో సూర్య బ్లాస్టింగ్ క్యామియో ఇచ్చిన సెన్సేషనల్ హిట్ చిత్రం “విక్రమ్”. దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ పర్ఫెక్ట్ గా తీసిన ఈ క్రేజీ మల్టీ స్టారర్ కమల్ కెరీర్ లోనే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా భారీ హిట్ గా నిలిచింది.

ఎలాంటి హిందీ వసూళ్లు లేకూండా 400 కోట్లు వసూళ్లు అందుకొని రికార్డులు సెట్ చేసిన ఈ చిత్రం లేటెస్ట్ గా అయితే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మరో సాలిడ్ రికార్డు సెట్ చేసినట్టు తెలుస్తుంది. ఒక్క ఇండియా లోనే ఈ చిత్రం టోటల్ గా 300 కోట్ల గ్రాస్ మార్క్ ని చేరుకుందట.

ఇది ఓ సినిమాకి అందులోని హిందీ వెర్షన్ లో సరైన వసూళ్లు లేకుండా అందుకోవడం అరుదు అని చెప్పాలి. మొత్తానికి అయితే కమల్ కం బ్యాక్ మాత్రం ఊహించని లెవెల్లో వచ్చిందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా కమల్ మరియు ఆర్ మహేంద్రన్ లు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :