తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు – కమల్ హాసన్

తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు – కమల్ హాసన్

Published on Jul 7, 2024 11:52 PM IST

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు-2’. ఐతే, హైదరాబాద్ లో నిర్వహించిన భారతీయుడు-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కమల్ హాసన్ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. 52 ఏళ్ల క్రితం నేను మొదటిసారిగా ఓ టెక్నీషియన్ గా హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటివరకు నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.

కె.బాలచందర్, కె.విశ్వనాథ్, శంకర్ వంటి దర్శకులు నాకు హిట్లు ఇచ్చారు. నన్ను ఇంతవాడిని చేశారు. భారతీయుడు-2 మనందరి సినిమా. ఇక నా దృష్టి అంతా ప్రతిభావంతులను ఇండస్ట్రీకి తీసుకురావడం పైనే ఉంటుంది. నేను గానీ, రజనీకాంత్ గానీ, నగేశ్ కానీ బాలచందర్ గారి వల్లే వెండితెరపై రాణిస్తున్నాం’ అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. ఇక జూలై 12, 2024న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు