షూటింగ్ కొంచమే మిగిలుందంటున్న కమల్ టీమ్ !
Published on Jun 20, 2017 9:42 am IST


విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రస్తుతం ‘విశ్వరూపం’ షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ షూటింగ్ కోసం కమల్ టర్కీ వెళ్లారని, ఇంకా షూటింగ్ బ్యాలన్స్ ఉందని వార్తలొచ్చాయి. వీటిపై స్పందించిన కమల్ టీమ్ అవేవీ నిజం కాదని, అసలు టర్కీలో షూటింగ్ లేనేలేదని తేల్చేసింది. అలాగే షూటింగ్ దాదాపు పూర్తయిందని, కొద్దిపాటి సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే మిగిలుందని అన్నారు.

అంతేగాక సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉండటం వలన సీజీ వర్క్ కూడా ఎక్కువ మోతాదులోనే ఉందని, ప్రస్తుతం వాటిపైనే టీమ్ పని చేస్తోందని, ఇంకో 10 శాతం మాత్రమే మిగిలుందని తెలిపారు. ఈ ఏడాదిలోనే విడుదలకానున్న ఈ చిత్ర్రంలో కమల్ ఒక రా ఏజెంట్ గా కనిపించనుండగా పూజా కుమార్, రాహుల్ బోస్, ఆండ్రియాలు పలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 
Like us on Facebook