హాట్ స్టార్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన కమల్ ‘విక్రమ్’

Published on Jul 12, 2022 11:00 pm IST

లోకనాయకుడు కమల్ హాసన్ తో యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తీసిన లేటెస్ట్ మల్టివర్స్ మూవీ విక్రమ్ హిట్ లిస్ట్. పాన్ ఇండియా మూవీగా ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరెకెక్కిన విక్రమ్, విడుదల తరువాత అన్ని భాషల్లో కూడా సూపర్ డూపర్ హిట్ కొట్టింది. కెరీర్ పరంగా కమల్ హాసన్ అందుకున్న అతి పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ విక్రమ్. దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 400 కోట్ల పైచిలుకు కలెక్షన్ అందుకుని అందరి నుండి ప్రశంసలు అందుకుంది. విక్రమ్ మూవీలో ఫహాద్ ఫాసిల్, విజయ్ సేతుపతి కీలక రోల్స్ చేసారు.

ఇక ఈ మూవీని గ్రాండియర్ గా సాగే యాక్షన్ థ్రిల్లర్ గా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించారు డైరెక్టర్ లోకేష్. అయితే అటు థియేటర్స్ లో కలెక్షన్స్ తో అదరగొట్టిన విక్రమ్, మొన్న ఒటిటి మాధ్యమం హాట్ స్టార్ ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రస్తుతం తిరుగులేకుండా దూసుకెళ్తోంది. విక్రమ్ మూవీ వీకెండ్ హైయెస్ట్ వ్యూవర్ షిప్ తో పాటు వాచ్ టైం పరంగా హైయెస్ట్ సబ్ స్క్రిప్షన్ సాధించిన మూవీగా సెన్సేషనల్ రికార్డు నెలకొల్పిందని కొద్దిసేపటి క్రితం డిస్నీ హాట్ స్టార్ వారు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. ఆ విధంగా అటు వెండితెరపైనే కాదు ఇటు బుల్లితెరపై కూడా అదరగొడుతోంది విక్రమ్ మూవీ.

సంబంధిత సమాచారం :