కమల్ యాంగ్రీ లుక్కే స్పెషల్ అట్రాక్షన్ !

కమల్ యాంగ్రీ లుక్కే స్పెషల్ అట్రాక్షన్ !

Published on Nov 21, 2022 11:54 PM IST

విజువల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2. కాగా ఈ సినిమాలో ఇంటర్వెల్ లో వచ్చే కమల్ హాసన్ కొత్త లుక్ సినిమాకే హైలైట్ గా నిలుస్తోందట. ముఖ్యంగా యాంగ్రీ లుక్‌లో కమల్ గెటప్ అండ్ సెటప్ అదిరిపోతాయని.. థియేటర్స్ లో ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా కమల్ హాసన్ స్టంట్స్ ఉంటాయని తెలుస్తోంది. అలాగే ఈ సీక్వెన్స్ లో కమల్ హాసన్ చెప్పే డైలాగ్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటాయట.

కాగా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ‘భారతీయుడు 2’లో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఇక భారతీయుడు 2 రన్ టైం 3 గంటలకు పైనే నిడివి ఉండే అవకాశం ఉందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్ ఈ నిడివి ని కూడా తగ్గించే పనిలో ఉన్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు