కమల్ సినిమా విడుదల రజనీ చేతిలో !

8th, November 2017 - 06:11:27 PM

విస్వనాయుడు కమల్ హాసన్ చేస్తున్న ప్రాజెక్ట్స్ లో ‘విశ్వరూపం-2’ కూడా ఒకటి. టెర్రరిజం ప్రధాన అంశంగా రూపొందుతున్న ఈ చిత్రం ‘విశ్వరూపం’ కు సీక్వెల్ గా తెరకెక్కుతోంది. చాన్నాళ్ల క్రితమే మొదలైన ఈ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయి మళ్ళీ ఈ మధ్యే మొదలై ప్రస్తుతం తుది దశకు చేరుకుంది. ఈ నెలాఖరుకు సినిమా మొత్తం పూర్తయ్యే అవకాశముంది.

దీంతో విడుదల పనులు మొదలుపెట్టారు కమల్. చిత్రాన్ని వచ్చేఏడాది ఏప్రిల్ నెలలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ రజనీ ‘2.0’ కూడా అదే నెలలో విడుదలకానుందని అన్నారు. ఒకవేళ అదే గనుక కన్ఫర్మ్ అయితే క్లాష్ ఉండకుండా జనవరి వెళ్లాలని ఒకవేళ ‘2.0’ ఏప్రిల్ లో రాకపోతే ఆ నెలకే ఫిక్సయ్యే యోచనలో ఉన్నారు కమల్. మొత్తం మీద కమల్ తన సినిమా విడుదలను ఇప్పుడు రజనీ చేతిలో పెట్టేశారు.