విడుదలకు సిద్దమైన ‘కణం’ ట్రైలర్!

15th, November 2017 - 03:55:39 PM

యంగ్ హీరో నాగ శౌర్య, ‘ఫిదా’ తో బాగా పాపులర్ అయిన సాయి పల్లవి కలిసి నటించిన చిత్రం ‘కణం’. తమిళం,తెలుగు రెండు భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. హర్ర జానర్లో ఉండనున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ తోనే మంచి అంచనాల్ని క్రియేట్ చేసుకుంది.

ప్రస్తుతం చివరి దశ పనుల్లో ఉన్న ఈ సినిమా ట్రైలర్ త్వరలోనే విడుదలకానుందట. తమిళంలో ‘కారు’ పేరుతో రానున్న ఈ సినిమాకు రజనీ ‘2.0’ సినిమాటోగ్రఫర్ నిర్వాణ సాహ కెమెరా వర్క్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరొక విశేషమేమిటంటే ఇందులో సాయి పల్లవి 4 ఏళ్ల పాపకు తల్లిగా నటించనుంది.