పాగల్ నుండి విడుదలైన ఎమోషనల్ సాంగ్ “కనపడవా”

Published on Aug 13, 2021 9:00 pm IST

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పాగల్. ఈ చిత్రం ఆగస్ట్ 14 వ తేదీన విడుదల కి సిద్దం అయింది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా చిత్ర యూనిట్ ఈ చిత్రం నుండి ఒక పాటను విడుదల చేయడం జరిగింది.

కనపడవా అంటూ ఎమోషనల్ గా సాగే ఈ పాట ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చిత్రం లో అమ్మాయిల వెంట పడే వ్యక్తి గా కనబడుతున్న ప్రేమ్, లవ్ లో ఎలా పడతాడు, తన ప్రేమను ఎలా దక్కించుకుంటాడు అనేది సినిమా కాన్సెప్ట్ అని తెలుస్తోంది. ఈ సినిమా విడుదల అవుతుండటం తో అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. నరేష్ కుప్పిలి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో సిమ్రాన్ చౌదరీ, రాహుల్ రామకృష్ణ, మురళి శర్మ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం రధన్ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :