భారీ మార్క్ కి చేరిన “కాంతారా” హిందీ వసూళ్లు.!

భారీ మార్క్ కి చేరిన “కాంతారా” హిందీ వసూళ్లు.!

Published on Nov 5, 2022 3:09 PM IST

కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “కాంతారా” కోసం తెలిసిందే. మరి రిషబ్ స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించిన ఈ చిత్రం భారీ హిట్ కాగా తెలుగు సహా హిందీ మరియు కన్నడ లో సెన్సేషన్ ని రేపింది మరి రీసెంట్ గానే 300 కోట్లకి పైగా గ్రాస్ ని ఈ చిత్రం అందుకోగా హిందీలో లేటెస్ట్ వసూళ్లు డీటెయిల్స్ తెలుస్తున్నాయి.

ఈ చిత్రం ఒక్క హిందీ వెర్షన్ లో 50 కోట్ల నెట్ వసూళ్లు క్రాస్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి నిన్న ఈ చిత్రం 2 కోట్లకి పైగా నమోదు చేయగా మొత్తం అయితే 50 కోట్ల మార్క్ ని ఈ చిత్రం క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు అయితే 51 కోట్లకి పైగా వసూలు చేయగా ఈ వారాంతంలో కూడా సినిమా సూపర్ స్ట్రాంగ్ వసూళ్లు నమోదు చేయనున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు