‘సైరా నరసింహారెడ్డి’ లో యువ హీరోయిన్!


మెగాస్టార్ చిరంజీవి చేయనున్న 151వ సినిమా ‘సైరా నరసింహా రెడ్డి’ పై ప్రేక్షకుల్లో ఎంతటి అంచనాలున్నాయో తెలిసిన సంగతే. ఈ సినిమా కోసం ఇప్పటికే అమితాబ్, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్ వంటి పెద్ద పెద్ద స్టార్లను కొన్ని ముఖ్య పాత్రల కోసం తీసుకున్నారు. ఇక మిగిలి ఉన్న ఇంకొన్ని పాత్రల్లో నటులను వెతికేపనిలో ఉన్నారు టీమ్. ఈ ప్రాసెస్లో భాగంగా కథలో కీలకమైన రోల్ కోసం యంగ్ బ్యూటీ ప్రగ్య జైస్వాల్ ను అనుకుంటున్నారట.

‘కంచె’ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రగ్య కేవలం సోలో హీరోయిన్ గా మాత్రమేగాక ‘నక్షత్రం, జయ జానకి నాయక’ వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేసి మెప్పించింది. కనుక ఆమెను తీసుకుంటే బాగుంటుందనే ఆలోచనలు జరుగుతున్నాయట. ఒకవేళ ఇదే నిజమై మెగాస్టార్ సినిమాలో ఆఫర్ దక్కించుకుంటే ప్రగ్య కెరీర్ మరో మెట్టు పైకెక్కడం ఖాయం.