నూతన నటీనటులు మల్లిక శంకర్ , కిషోర్ రావు, గౌతమ్ నంద, అమిత శ్రీ, హీరో హీరోయిన్ గా యువన్ టూరింగ్ టాకీస్ బ్యానర్ పై గణేష్ అగస్త్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కంచు కనకమాలక్ష్మి’. అజయ్ పట్నాయక్ సంగీత సారధ్యంలో పాటల రికార్డింగ్ తో ప్రారంభం అయిన ఈ చిత్రానికి వీరేంద్రనాథ్ కోలుకుల, భరత్ అట్లూరి, బృందకర్ గౌడ్ ,రాజేష్ గంగునాయుని, గణపతి నాయుడు సీర, కొండల రావు చూక్కాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ విజయదశమి రోజున సినిమా కి సంబంధించిన పూజ మరియు పాటల రికార్డింగ్ తో ప్రారంభం చేసింది చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. “ఇకపై ఏడాదికి 3 సినిమా లు చెయ్యాలనే సంకల్పం తో మేము అనగా వీరేంద్రనాథ్ కోలుకుల, భరత్ అట్లూరి, బృందకర్ గౌడ్ ,రాజేష్ గంగునాయుని, గణపతి నాయుడు సీర, కొండల రావు చూక్కాల అందరం కలిసి ఒక సిండికేట్ గా ప్రయాణం స్టార్ట్ చేసాం, మొదటి చిత్రం గా కంచు కనకమాలక్ష్మి తర్వాతి చిత్రం బోయ్ బెస్టీస్ చేస్తున్నాము. ఈ బాయ్ బెస్టీస్ కి రుద్ర అనే కొత్త దర్శకుడి ని పరిచయం చేస్తున్నాను” అని తెలిపారు.
అలాగే దర్శకుడు గణేష్ అగస్త్య మాట్లాడుతూ.. “ఇది క్రైమ్ థ్రిల్లర్ చిత్రం, అందరికీ కంచు కనకమాలక్ష్మి స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చుతుంది. ఈ విజయదశమి నాడు అజయ్ పట్నాయక్ సంగీత దర్శకత్వంలో పాటల రికార్డింగ్ తో మొదలుపెట్టాము. ఈ నెల 10 నుంచి షూటింగ్ కి వెళ్ళబోతున్నాము. విజయనగరం, పట్టిసీమ, అరకు పరిసర ప్రాంతాల్లో 28 రోజులు షెడ్యూల్ ప్లాన్ చేసాము.. తరువాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తున్నామని” చెప్పారు.
సంగీత దర్శకుడు అజయ్ పట్నాయక్ మాట్లాడుతూ.. “సినిమాలో మొత్తం 4 పాటలు ఉంటాయి. కంచు కనకమాలక్ష్మి టైటిల్ సాంగ్ ప్రేక్షకులకు బాగా రీచ్ అవుతుంది. ఫేమస్ సింగర్ తో ఆడియో పాడిస్తున్నాము. కథ చాలా బాగా ఉండటం తో ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది” అని తెలిపారు.
హీరోయిన్ మల్లిక శంకర్ మాట్లాడుతూ.. “ఇది నా మొదటి చిత్రం. నాకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గణేష్ అగస్త్య గారికి నా ధన్యవాదాలు. నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అజయ్ పట్నాయక్ గారి సంగీతం చాలా బాగుంది. పాటలు కూడా చాలా బాగా వచ్చాయి. ఈ చిత్రం ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది” అని తెలిపారు.
మరో హీరోయిన్ అమిత శ్రీ మాట్లాడుతూ.. “ఇది నా రెండో చిత్రం. నాకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గణేష్ అగస్త్య గారికి నా ధన్యవాదాలు. నా క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గణేష్ అగస్త్య గారికి నా ధన్యవాదాలు. కథ చాలా కొత్తగా ఉంటుంది, సస్పెన్స్ మరియు ట్విస్ట్ లు చాలా బాగుంటాయి. అందరి క్యారెక్టర్ లు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి” అని తెలిపింది.
