మణికర్ణిక సెట్స్ లో తీవ్రంగా గాయపడ్డ కంగనా రనౌత్ !
Published on Jul 20, 2017 11:29 am IST


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘మణికర్ణిక’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదారాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో జరుగుతోంది. కాగా నిన్న షూటింగ్ సయమంలో పోరాట సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు వేరొకరి కత్తి కంగనా ముఖానికి తగలడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.

రెండు కనుబొమ్మల మధ్యలో కత్తి వేటు తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో చిత్ర బృందం ఆమెను వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించగా అక్కడి వైద్యులు గాయానికి కుట్లు వేసి కొద్దిరోజులు అబ్జర్వేషన్లో ఉండాల్సిందిగా సూచించారు. దీనిపై నిర్మాత కమల్ జైన్ మాట్లాడుతూ ఎలాంటి డూప్స్ లేకుండా యుద్ధ సన్నివేశాలు చేసే సమయంలో పొరపాటున ఈ ప్రమాదం జరిగిందని, కంగనా చాలా ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొందని అన్నారు.

ఘాన్సీ రాణి లక్ష్మీ భాయి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని 2018 లో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు.

 
Like us on Facebook