ఈ దేశం ఖాన్‌ లను మాత్రమే ప్రేమిస్తుంది – కంగనా

Published on Jan 30, 2023 12:14 pm IST

వివాదాల హీరోయిన్ ‘కంగనా రనౌత్’ అంటేనే వివాదాలకు కేంద్ర బిందువు. ఆమె అంటే బాలీవుడ్ కి భయం. ఎప్పుడు ఎవరిని తిడుతుందో అని స్టార్ హీరోల సైతం కంగనా దెబ్బకు భయపడుతూ ఉంటారు. అయితే, కంగనా మాత్రం తనదైన శైలిలో విమర్శలతో రెచ్సిపోతూ ఉంటుంది. ‘పఠాన్‌’ విడుదలై మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఐతే, ఈ చిత్ర విజయాన్ని విశ్లేషిస్తూ ఓ నెటిజన్‌ ఈ విధంగా కామెంట్‌ చేసింది. ‘‘హిందువులు, ముస్లింలూ షారుఖ్‌ని సమానంగా ప్రేమిస్తారు. బహిష్కరణ వివాదాలు సినిమాకి సహాయం చేస్తాయి. రొమాన్స్‌, మంచి సంగీతం ఉంటే చాలు సినిమాలు ఆడతాయి. అందుకే భారత్‌ సెక్యులర్‌ దేశం’’ అని కామెంట్‌ పెట్టింది ఓ నెటిజన్.

ఐతే, ఆ నెటిజన్ కామెంట్స్ కి కంగనా తనదైన శైలిలో షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘చాలా మంచి విశ్లేషణ. ఈ దేశం చాలా సందర్భాలలో కేవలం ఖాన్‌లను మాత్రమే ప్రేమిస్తుంది. ముస్లిం హీరోయిన్లంటే మక్కువ చూపిస్తుంది. కాబట్టి, ఈ దేశంలో ద్వేషం, పాసిజం ఉందని నిందలు వేయడం చాలా అన్యాయం. ప్రపంచంలో భారత్‌ లాంటి దేశం ఇంకోటి లేదు’’ అంటూ కంగనా వాఖ్యలు చేసింది.

సంబంధిత సమాచారం :