యాంగ్రీ యంగ్ మాన్…అమితాబ్ బచ్చన్ మిగిల్చిన శూన్యాన్ని భర్తీ చేసాడు యశ్ – కంగనా రనౌత్

Published on Apr 17, 2022 4:30 pm IST


యశ్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్2. ఈ చిత్రం లో యశ్ నటనకు దేశ వ్యాప్తంగా సినీ పరిశ్రమ కి చెందిన ప్రముఖులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ లిస్ట్ లోకి తాజాగా బాలీవుడ్ భామ కంగనా రనౌత్ చేరడం విశేషం.

అనేక దశాబ్దాలు గా ఇండియా నుండి తప్పిపోయిన యాంగ్రీ యంగ్ మాన్ యశ్ అంటూ చెప్పుకొచ్చారు. డెబ్బై ల నుండి మిస్టర్ అమితాబ్ బచ్చన్ మిగిల్చిన శూన్యాన్ని భర్తీ చేసాడు యశ్ అంటూ చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా ద్వారా కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ గా మారుతోంది. కేజీఎఫ్2 ఇప్పటికే అనేక రికార్డు లను బద్దలు కొడుతూ, సరికొత్త రికార్డు లను క్రియేట్ చేస్తోంది.

సంబంధిత సమాచారం :