టబు పై ‘కంగనా రనౌత్’ పొగడ్తల వర్షం !

టబు పై ‘కంగనా రనౌత్’ పొగడ్తల వర్షం !

Published on Nov 21, 2022 11:20 PM IST

వివాదాల హీరోయిన్ ‘కంగనా రనౌత్’ అంటేనే వివాదాలకు కేంద్ర బిందువు. నిత్యం తనదైన శైలిలో విమర్శలతో రెచ్చిపోతూ ఉంటుంది కంగనా. అయితే, ఒక్కోసారి కంగనా తోటి నటీనటుల పై ప్రశంసలు కూడా కురిపిస్తోంది. తాజాగా కంగనా హిందీ సినిమాలపై తన ఓపినియన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ మాజీ అండ్ బోల్డ్ బ్యూటీ టబు పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

కంగనా తన ఇన్‌స్టాగ్రామ్‌ లో షేర్ చేసిన స్టోరీలో.. ‘50 ఏళ్ల వయస్సులో కూడా టబు ఒంటరిగా బాలీవుడ్ ని కాపాడింది. ఈ ఏడాది టబు నటించిన రెండు హిందీ సినిమాలు భూల్ భూలయ్యా 2, దృశ్యం 2 మాత్రమే బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ఈ రెండు చిత్రాలలో టబు అద్భుతంగా నటించి మెప్పించింది. 50 ఏళ్ల వయస్సులోనూ స్టార్‌గా నిలిచి హిందీ పరిశ్రమ పరువును కాపాడింది. అందుకే, ఆమె ఎంతోమందికి స్ఫూర్తి’ అంటూ కంగనా రనౌత్ తన పోస్ట్ లో రాసుకొచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు