నవంబర్ 6న ‘కంగనా రనౌత్’ మొదలుపెట్టనుందా ?

Kangana Ranaut

తమిళ దర్శకుడు ఎ.ఎల్‌.విజ‌య్ ‘తలైవి’ అనే టైటిల్ తో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోంది. కాగా నవంబర్ 6వ తేదీ నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కోసం తమిళం కూడా నేర్చుకుంటున్న ఈ బాలీవుడ్ క్వీన్.. బరువు కూడా పెరుగనుంది. ఈ సినిమా కోసం దాదాపు పది కిలోలు వరకూ కంగనా బరువు పెరగుతుందట. అయితే ఫస్ట్ షెడ్యూల్ తరువాతే ఆమె బరువు పెరగనుంది. ఫస్ట్ షెడ్యూల్ లో జయలలిత యుక్త వయసులో ఉన్నప్పటి సన్నివేశాలను షూట్ చేయనున్నారు.

ఇక ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్‌ స్వామి నటించబోతుండగా.. అదే విధంగా మరో కీలక పాత్ర మాజీ సీఎం కరుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె ఆలోచనా విధానం కూడా సినిమాలో హైలెట్ చేస్తూ కథ ఉంటుందట. బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ రాసిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు , హిందీ భాషల్లో కూడా విడుదలకానుంది. విష్ణు ఇందూరి, శైలేష్ సింగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version