సీత గా వస్తున్న కంగనా రనౌత్…కథ అందిస్తున్న విజయేంద్ర ప్రసాద్!

Published on Sep 14, 2021 7:26 pm IST


కంగనా రనౌత్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు భిన్న పాత్రలు పోషించి ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న నటి కంగనా రనౌత్. ఇప్పటికే తలైవి చిత్రం తో విజయం సాధించిన కంగనా, మరొక హిట్ చిత్రం ను లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో సీత చిత్రం లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రానికి అలౌకిక్ దేశాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి అలౌకిక్ మరియు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ కథ కథనం అందిస్తున్నారు. ఈ చిత్రం అనౌన్స్ మెంట్ తో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సంబంధిత సమాచారం :