తాప్సీ పై కంగనా ఘాటు కామెంట్స్ !

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ‘కంగనా రనౌత్’ వివాదాస్పద విషయాలతో ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆమెకు పోటీగా తాప్సీ కూడా ఆమె పై ఘాటు మాటల వర్షం కురిపిస్తోంది. తాజాగా కంగనా రనౌత్, తాప్సీ మధ్య మాటల యుద్ధం మళ్లీ మొదలైంది. రీసెంట్ గా తాప్సీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కంగనా పై నెగిటివ్ కామెంట్స్ చేసింది. తాజాగా కంగనా సోషల్ మీడియా వేదికగా తాప్సీకి ఘాటుగా బదులిచ్చారు.

కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో స్పందిస్తూ.. ‘‘ఓ ‘చౌకబారు కాపీ’ తన బి-గ్రేడ్ సినిమా ప్రమోషన్ల కోసం బయటకు వచ్చింది. ఎప్పటిలాగే మీడియా హెడ్‌ లైన్స్‌ లో ఉండటానికి నా పై కామెంట్స్ చేస్తూ ఉంటుంది. తాజాగా నా తల్లిదండ్రుల గురించి మాట్లాడి హద్దులు దాటింది. అసలు ఒక నిజమైన బిడ్డకు ఎందుకు జన్మనివ్వలేకపోయారో.. ఆమె తల్లిదండ్రులనే అడగాలనిపిస్తోంది నాకు. ఇలాంటి చౌకబారు కాపీని కన్నందుకు వాళ్లని చూస్తే జాలేస్తోంది’’ అంటూ కంగనా చాలా ఘాటుగా కామెంట్స్ చేసింది.

Exit mobile version